Latest Posts

గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట

గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir), ఆయన కుటుంబ సభ్యులు, మరియు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసులలో ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులను కొనుగోలు చేసి, నిల్వ చేసి పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించిన కేసులను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు.

గంభీర్‌పై వచ్చిన ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ కేసుల కారణంగా భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ కొంతకాలం న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్నారు. తాజాగా, ఢిల్లీ హైకోర్టు ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు వెల్లడించడంతో, ఆయన మరియు ఆయన ఫౌండేషన్‌కు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. పూర్తి తీర్పు వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

Editor