Latest Posts

రాజాసాబ్: గ్లోబల్ ప్రమోషన్స్ ప్లాన్!

ప్రభాస్ అభిమానులకు మరో అద్భుతమైన వార్త అందింది. రెబల్ స్టార్ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాజాసాబ్‌’ (Rajasab) ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్‌ చేయడానికి దర్శకుడు మారుతి ఒక ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ గ్లోబల్ ప్రమోషన్స్ ద్వారా సినిమాపై ఉన్న భారీ అంచనాలను మరింత పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో వాణిజ్య అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌, మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నీ ఉండబోతున్నాయని సమాచారం. ఈ అంశాలన్నీ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

త్వరలోనే ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ విడుదల కానుంది, ఆ తర్వాత ప్రతి 10 రోజులకు ఒక కొత్త సాంగ్ విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. అలాగే, క్రిస్మస్ సమయంలో అమెరికాలో ఒక ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇక న్యూఇయర్ సందర్భంగా ట్రైలర్ కూడా రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళికతో రాజాసాబ్ హడావుడిని గ్లోబల్ స్థాయిలో పెంచాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.

Editor