Latest Posts

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు: భారతీయులకు ట్రంప్ శుభాకాంక్షలు, మోదీని ‘మంచి మిత్రుడు’గా కీర్తించారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దీపాలు వెలిగించి, భారతీయులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ట్రంప్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు ‘మంచి మిత్రుడు’ అని, ఇరు దేశాల మధ్య వాణిజ్యం గురించి తాజాగా మోదీతో తాను మాట్లాడినట్లు తెలిపారు. అంతేకాకుండా, యుద్ధాలను ఆపుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పుతున్నట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు.

దీపావళి పండుగ సందర్భంగా వేడుకలు జరుపుకునేవారు శత్రువుల ఓటమి, అడ్డంకులను అధిగమించడం, చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటారని ట్రంప్ తెలిపారు. జ్ఞాన మార్గాన్ని అనుసరించడం, దివ్య జ్వాల ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో భారత సంతతికి చెందిన అధికారులు, ప్రముఖులు కాశ్‌ పటేల్, తులసీ గబ్బార్డ్ వంటి వారు కూడా పాల్గొన్నారు.

భారత్‌పై అమెరికా సుంకాలు పెంపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు వంటి అంశాలు చర్చలో ఉన్న తరుణంలో ట్రంప్ ఈ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య శాంతితో సంబంధాలు కొనసాగాలని ట్రంప్ ఆకాంక్షించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Editor