RCB ప్రతినిధులను అరెస్ట్ చేయండి: CM
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు.
RCB, DNA మేనేజ్మెంట్, KSCA ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే RCB యాజమాన్యంపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించిన FIR కాపీ బయటికొచ్చింది.
ఇందులో A1గా RCB, A2గా DNA మేనేజ్మెంట్, A3గా KSCAను చేర్చారు.