Latest Posts

ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఎట్టకేలకు ఒక మృతదేహం వెలికితీత..

ప్రమాదం జరిగిన 16 రోజులకు ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం బాగా కుళ్లిపోయి నుజ్జునుజ్జయిన స్థితిలో ఉంది. ఆ మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది అని భావిస్తున్నారు.

 

అయితే, అతడి కుటుంబ సభ్యులు గుర్తించిన తర్వాత ఓ నిర్ధారణకు రానున్నారు. కాగా, మృతుడి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు అందించనున్నట్టు తెలుస్తోంది. టన్నెల్ నుంచి వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టన్నెల్ ప్రమాదంలో మొత్తం 8 మంది గల్లంతైన సంగతి తెలిసిందే.

Editor