ఈనెల 23వ తేదీన షెడ్యూల్ ప్రకారం యథాతథంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు..

  • తప్పుడు ప్రచారం నమ్మొద్దు
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

 

అనంతపురం, ఫిబ్రవరి 22 :

 

– ఫిబ్రవరి 23న ఆదివారం జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ, గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని, ఏపీపీఎస్సీ నుండి అందిన సమాచారం మేరకు గ్రూప్ -2 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని కమిషన్ తెలిపిందని తెలిపారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

 

———————————————-

DIPRO.I&PR.ATP..

Posted Under AP
Editor