రాష్ట్రంలో అధికార పార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల పందేరం కొనసాగుతోంది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను నియమించిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను నియమించింది. ఈ 30 మార్కెట్ కమిటీలలో 25 తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి , నాలుగు జనసేన పార్టీకి, ఒకటి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి దక్కాయి.
అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. త్వరలో మిగతా మార్కెట్ కమిటీలకు ఛైర్మన్‌లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం 218 మార్కెట్ కమిటీలు ఉండగా, మూడు విడతల్లో 115 కమిటీలకు నామినేటెడ్ పదవులు భర్తీ అయ్యాయి. ఇంకా 103 మార్కెట్ కమిటీలకు పాలకమండళ్లను నియమించాల్సి ఉంది.
నూతన ఎఎంసీ ఛైర్మన్లు వీరే
* పులివెందుల – సింహాద్రిపురం – బండి రామాసురరెడ్డి
* కాకినాడ నగరం – కాకినాడ – బచ్చు శేఖర్
* ఉండి – ఆకివీడు – బొల్లా వెంకటరావు
* ప్రత్తిపాడు (గుంటూరు) – ప్రత్తిపాడు – బొందలపాటి అమరేశ్వరి
* ఇచ్ఛాపురం – ఇచ్ఛాపురం – బుద్ధ మణిచంద్ర ప్రకాష్
* యర్రగొండపాలెం (ఎస్సీ) – వై. పాలెం – చేకూరి సుబ్బారావు
* గన్నవరం (ఎస్సీ) – అంబాజీపేట – చిట్టూరి శ్రీనివాస్
* తణుకు – అత్తిలి – దాసం ప్రసాద్
* చంద్రగిరి – పాకాల – కె. సుధాకరయ్య
* పుంగనూరు – సోమాల – కరణం శ్రీనివాసులు నాయుడు
* పూతలపట్టు (ఎస్సీ) – బంగారుపాలెం – కర్రియావుల భాస్కర్ నాయుడు
* బనగానపల్లె – బనగానపల్లి – కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి
* నందిగామ (ఎస్సీ) – కంచికచెర్ల – కోగంటి వెంకటసత్యనారాయణ
* అవనిగడ్డ – అవనిగడ్డ – కొల్లూరి వెంకటేశ్వరరావు (టీడీపీ)
* పెనమలూరు – ఉయ్యూరు – కొండా ప్రవీణ్ కుమార్
* పాడేరు (ఎస్టీ) – పాడేరు – మచ్చల మంగతల్లి
* రాజమండ్రి రూరల్ – రాజమండ్రి – మార్ని వాసుదేవ్
* కొవ్వూరు (ఎస్సీ) – కొవ్వూరు – నాదెళ్ల శ్రీరామ్ చౌదరి
* మైలవరం – విజయవాడ – నర్రా వాసు
* పెడన – మల్లేశ్వరం (హెచ్‌క్యూ) బంటుమిల్లి – ఒడుగు తులసీరావు
* రైల్వే కోడూరు – కోడూరు – పగడాల వరలక్ష్మి
* అనకాపల్లి – అనకాపల్లి – పచ్చికూర రాము
* మైలవరం – మైలవరం – పొనకళ్ల నవ్యశ్రీ
* మాడుగుల – మాడుగుల – పుప్పాల అప్పలరాజు
* మచిలీపట్నం – మచిలీపట్నం – ఎస్జీఎన్ వెంకట దుర్గా ప్రసాద్ (కుంచె నాని)
* చంద్రగిరి – చంద్రగిరి – ఎస్. గౌష్ బాషా
* ఉంగుటూరు – భీమడోలు – శేషపు శేషగిరి
* జమ్మలమడుగు – జమ్మలమడుగు – సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి
* మార్కాపురం – పొదిలి – సయ్యద్ ఇమామ్ సాహెబ్
* గురజాల – పిడుగురాళ్ల – తురక వీరాస్వామి
