మండల టిడిపి నాయకులందరూ సభ్యత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి..

Yes. 9tv యాడికి

మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు.
యాడికి మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలై నెల గడుస్తున్నా స్థానిక గ్రామ, మండల స్థాయి నాయకులు తమ వార్డులలో సభ్యత్వం చేయకుండా అలసత్వం వహిస్తున్నారని కన్వీనర్ తెలిపారు. ప్రతి నాయకుడు రోజూ కనీసం 20 మందిని టిడిపి సభ్యత్వాలు చేర్పించాలని ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి ఆదేశించారని కన్వీనర్ తెలిపారు.
టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం పొందుతున్న స్టోర్ డీలర్లు, ముఖ్య నాయకులు పార్టీ కార్యక్రమాలు విస్మరించారని ఇప్పటి నుండైనా ప్రతి నాయకుడు తమ పరిధిలో సభ్యత్వాలు ప్రతిరోజు తప్పనిసరిగా చేపించాలని కన్వీనర్ తెలిపారు.

Posted Under AP
Editor