Yes. 9tv
యాడికి: స్వర్గీయ కుండా నరసింహులు సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు.యాడికి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ సెక్రెటరీగా పని చేసిన కుండా నరసింహులు 13వ వర్థంతి సందర్భంగా శుక్రవారం చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో వృద్దులకు ఆయన కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ సొసైటీ సెక్రటరీగా నరసింహులు రైతులకు అందించిన సేవలను కొనియాడారు.రైతులకు రుణ సదుపాయం కల్పించడంలో, విత్తన పంపిణీ కార్యక్రమాలలో ఆయన సేవలు అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో ఆయన సతీమణి, రిటైర్డ్ టీచర్ కుండా చౌడమ్మ, కుమారుడు లక్ష్మినారాయణ, కోడలు రమాదేవి, మనవడు సాయి నృసింహ, వృద్ధాశ్రమ ప్రెసిడెంట్ బాలయ్య,నిర్వాహకులు, పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
