Latest Posts

గోరంటాల గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

INC:- ఆగస్టు 27 ఆదివారం రోజున గంభీరావుపేట మండల గొరంటాల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీమతి కొమిరిశెట్టి విజయ తిరుపతి వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి,గారు, ప్రారంభించారు,

ఈ సందర్భంగా విజయ గారు మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు, ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లకు రైతులు వడ్లను అమ్ముకొని సరైన మద్దతు ధరలు పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు,
తూకం విషయంలో ఒక బస్తాకు 40 కిలోల 600 గ్రాములు తూకం మాత్రమే ఉంటుందని అన్నారు,
కొనుగోలు సెంటర్లలో రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాట్లు ఉంటాయి మరియు సన్న వడ్లకు 500 రూపాయలు బోనసుగా మద్దతు ధరను
రాష్ట్ర ప్రభుత్వం కల్పించారని వారు వివరించారు,
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని రైతులను కొరారు, రైతు పండించిన వరి ధాన్యం చివరి ప్రతి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని రైతులకు భరోసా కల్పించారు,
తూకం విషయంలో మోసాలు చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని శ్రీమతి కొమిరిశెట్టి విజయ తిరుపతి గారు ఘాటుగా హెచ్చరించారు,
కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రారాజుగా చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చైర్మన్ గారు కొనియాడారు,
👉 గోరంటాల గ్రామంలో నూతనంగా వ్యవసాయ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లకు, పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు పిఏ సిఎస్ డైరెక్టర్లు ఎ ఏం సి డైరెక్టర్లు మరియు ఇతరులు ఘనంగా శాలువాతో సన్మానం చేయడం జరిగింది, ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి కొమిరిశెట్టి విజయ తిరుపతి, వైఎస్ చేర్మన్ డైరెక్టర్లు, గారు ,ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ గోరంటాల గ్రామానికి రుణపడి ఉంటానని వారన్నారు ఇట్టి కార్యక్రమంలో పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ రామాంజ గౌడ్, పాక్స్ డైరెక్టర్లు రాగుల అంజిరెడ్డి, మల్యాల రాజ్వీర్, సెస్ చైర్మన్ గౌరీనేని నారాయణ రావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దొమ్మాట నరసయ్య, బీసీ సెల్ అధికార ప్రతినిధి పర్శహాన్మండ్లు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిరి శెట్టి తిరుపతి, ప్రధాన కార్యదర్శి మూల రామచంద్ర రెడ్డి, పార్టీ సోషల్ మీడియా ( గౌరీ) శంకర్, ఏ ఎం సి డైరెక్టర్లు కొత్తపెళ్లి బాల్ రెడ్డి కల్వకుంట్ల లక్ష్మణరావు ఎల్లరాజ్యం ఎడబోయిన ప్రభాకర్ కోటలింగం భూక్య విఠల్ జంగం పెళ్లి గంగరాజు గౌడ్ బోండ్ల సత్తయ్య గెరుగంటి రాజనర్సు యండి అజాం, ఉప్పల కృష్ణమూర్తి వంగ రాజారాం రెడ్డి,లతొ పాటు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు హమాలీలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Editor