ఎస్ 9టీవీ న్యూస్ అనంతపురం అక్టోబర్ 4.
గత నెల 21వ తేదీ కేరళాలో మొదలైన అశోక అంబేద్కర్ ధమ్మ యాత్ర గురువారం సాయంత్రం 6 గంటలకు అనంతపురం పట్టణానికి చేరుకున్న అశోక అంబేద్కర్ ధమ్మ యాత్ర ర్యాలీ అనంతపురం జిల్లా కమిటీ సభ్యులైన బంతే సధ్ధా రక్కిత, శివానంద, తిరుమలయ్య, హరిప్రసాద్, ఆనందరాజు,బాలకొండన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మొదట కమిటీ సభ్యులు అశోక చక్రవర్తి విగ్రహానికి గజమాల వేయగా బయలు దేరిన ధమ్మ యాత్ర ర్యాలీ కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు నుంచి మొదలై టవర్ క్లాక్ కూడలి, సప్తగిరి సర్కిల్ మీదుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు బౌధ్ధులు, అంబేద్కర్ వాదులు, ప్రజా సంఘాలు, శాంతి ప్రేమికులు, బహుజన నాయకులు ప్రజలందరూ అనేక మంది కలిసి పాల్గొని మేళతాళాలతో, పూల వర్షం కురిపిస్తు జై భీమ్ నినాదాలు తో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి బంతే సధ్ధా రక్కిత మాట్లాడుతూ అశోక అంబేద్కర్ ధమ్మ యాత్ర ముఖ్య ఉద్దేశం శాంతి సామరస్యం నెలకొల్పి, సమాజంలో కుల, మత, ద్వేషాలను, చెడు వ్యసనాలను, మూఢ విశ్వాసాలను దూరం చేసి మనుషులను ఉన్నతులుగా, శీలవంతులుగ తీర్చిదిద్ది, ప్రపంచ శాంతి కోసం, భారతీయుల మధ్య ఐక్యత కోసం, దేశంలో శాంతి సమానత్వం కాంక్షిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు లక్ష్యంగా, గౌతమ బుద్ధిడి శాంతి బోధనలతో, అశోకుడి పరిపాలనలో సంక్షేమాలు తెలియజేస్తూ ప్రబుద్ధ భారత్-ప్రపంచ శాంతి ద్యేయంగా ధమ్మ యాత్ర కొనసాగుతూ ఉంటుంది అని, అదే క్రమంలో అనంతపురం లో అపూర్వ స్వాగతం లభించిందని తెలిపారు. ధమ్మ యాత్ర జాతీయ అధ్యక్షులు తమిళనాడు మైనారిటీ కమిషన్ సభ్యులు అయిన పూజ్య బంతే బాబుమౌర్య మాట్లాడుతూ కేరళా త్రివేండ్రం నుంచి బయలు దేరిన ధమ్మ యాత్ర 4500 కి.లో ప్రయాణం చేస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ 5 లక్షల మంది తో ధమ్మ దీక్ష తీసుకున్న ప్రదేశం ఉన్న నాగపూర్ చేరుకుని ముగిస్తుందనీ తెలియజేసారు. ప్రపంచ వ్యాప్తంగా హింస యుధ్ధాలు జరుతున్న ఈ సమయంలో భారతదేశంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇక్కడ బుద్ధుడు, అశోకుడు, అంబేద్కర్ జన్మంచడం వలనే సాధ్యం అవుతున్నది, అందువలన ప్రపంచం మొత్తం శాంతి సామరస్యం ధేయ్యంగా ప్రపంచ శాంతి కోసం ధమ్మ యాత్ర చేయడం జరుగుతుందని తెలియజేసారు. మీడియా సమావేశం అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ లోని బుద్ధ విహార్ పార్క్ చేరుకుని బుధ్ధ వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వారు తమిళనాడు నుంచి డాక్టర్ బాబు, స్వచ్చంద సేవకులు సాకే మల్లేష్, బిఎస్పీ నాయకులు గద్ధల నాగభూషణం, కాసాని నాగరాజు, అంకె కుళ్యాయప్ప, శ్రీరాములు, గోపాల్, రత్నమ్మ, నాగమ్మ, ఆదినారాయణ, సమతా సైనిక్ దల్ రాంబాబు, శ్రీనివాసులు, భూమి శంకర్, రాజా రమేష్, రాజగోపాల్, సుధీర్, సాకే శంకర్, ఎస్సీ సంక్షేమ సంఘం మద్దెల చెరువు మల్లిఖార్జున, రిటైర్డ్ డిసిఓ మారెప్ప, టీచర్ శశి కళ తదితరులు పాల్గొన్నారు….
