కేటీఆర్‌పై రాళ్ల దాడి….

మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారాన్ని ఒక కుదుపు కుదిపిన రాళ్లదాడి ప్రస్తుతం తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి వెళ్లారు. అక్కడ కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది.

 

భైంసాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుండగా కేటీఆర్‌పై కొంత మంది హనుమాన్ దీక్షాపరులు రాళ్లు రువ్వారు. జైశ్రీరామ్ పదం అన్నం పెడుతుందా అంటూ గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హనుమాన్ మాల ధరించిన కొంతమంది దీక్షాపరులు కేటీఆర్ మాట్లాడుతుండా రాళ్లు రువ్వారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కేటీఆర్ అసహనానికి లోనయ్యారు. సెక్యూరిటీ కల్పించని పోలీసులపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Editor