Latest Posts

షాకింగ్: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య

ముంబై: దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు వర్కర్లు దాబా యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

ఈ ఘటన నాగ్‌పూర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా సమీపంలోని దాబాలో శనివారం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

మృతుడిని మాజీ సర్పంచ్ రాజు థెంగ్రేగా పోలీసులు గుర్తించారు.

నిందితులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండ్లాకు చెందిన చోటు, ఆదిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఓ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా నిందితులిద్దరూ రాజు ధెంగ్రే దాబాలో వర్కర్లుగా చేరారు. అయితే, ఇటీవల యజమానితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తమకు దీపావళి బోనస్ అగడంతో వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, నిందితులకు ఇంకేదైనా రోజు డబ్బులు ఇస్తానని ధెంగ్రే అంగీకరించినట్లు తెలిసింది. అయితే, అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో యజమానిని హతమార్చాలని కుట్రపన్నిన నిందితులు.. అదేరోజు రాత్రి భోజనం అయ్యాక ధెంగ్రే నిద్రపోతున్న సమయంలో హత్య చేశారు. ధెంగ్రే నిదరపోతుండగా.. మెడకు తాడును బిగించి.. తలపై బండరాయితో కొట్టారు. పదునైన ఆయుధంతో దాడి చేశారు. దీంతో అతడి ముఖం ఛిద్రమైంది. అనంతరం ధెంగ్రే మృతదేహాన్ని ఓ బొంతలో కప్పి అతని కారులోనే అక్కడ్నుంచి పరారయ్యారు.

ఈ క్రమంలో విహార్ గావ్ సమీపంలోని నాగ్‌పూర్-ఉమ్రెడ్ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టడంతో నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. దీంతో కారు దిగి దిఘోరి వైపు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ఇది ఇలావుండగా, తన తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన తీయకపోవడంతో .. పక్కనేవున్న పాన్ దుకాణం నిర్వాహకుడికి ఫోన్ చేసింది ధింగ్రే కుమార్తె. దీంతో అక్కడికి వెళ్లిన అతడు.. ధింగ్రే రక్తపుమడుగులో ఉండటాన్ని చూసి ఆమెకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

YES9 TV