జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం
— జర్నలిస్టుల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు
— కదిరి నియోజకవర్గంలో త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం
— కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి
కదిరి, నవంబర్ 8:
👉 ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడంపై కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
👉 ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
👉 సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇస్తే కచ్చితంగా చేతల్లో చూపుతారన్నారు.
👉 ఎన్నికల హామీని నిలబెట్టుకుని జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడం ఆనందకరమన్నారు.
👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
👉 కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి జర్నలిస్టుకు త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి తో పాటు ఎమ్మెల్యే డా.పీవీ సిద్ధారెడ్డికి ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టులు:
✍🏻 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంపై కదిరిలోని పాత్రికేయులందరూ హర్షం వ్యక్తం చేశారు.
✍🏻 ఈ సందర్భంగా బుధవారం కదిరి పట్టణంలో జర్నలిస్టులు స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా దగ్గర నుండి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారిని ఆయన స్వగృహంలో కలిసి ఘనంగా సన్మానించారు.
✍🏻 జర్నలిస్టులు మాట్లాడుతూ..చాలా ఏళ్లుగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులతోపాటు అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం యోచిస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు.
✍🏻 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపడంపై జగన్ ప్రభుత్వానికి పాత్రికేయులు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
✍🏻 ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడం పట్ల యావత్ జర్నలిస్టు సోదరులు రుణపడి ఉంటారన్నారు.
✍🏻 మంత్రిమండలి నిర్ణయాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి చెప్పడం పట్ల పాత్రికేయులు అందరూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
