మూడు రూపాయల కోసం చూసుకుంటే.. రూ.25 వేలు కట్టాల్సి వచ్చింది..

కొన్నిసార్లు రూపాయి కోసం కకృత్తి పడితే వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన జిరాక్స్‌ షాప్‌ యజమానికి వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది.

నెలలో రూ.25 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఒడిశాలోని సంబల్‌పూర్‌లోని ఈ సంఘటన జరిగింది. బుధరాజా ప్రాంతానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రఫుల్ల కురార్ దాస్‌ ఏప్రిల్ 28న జిరాక్స్‌ కోసం ఫోటో జిరాక్స్ సెంటర్‌కు వెళ్లాడు.

ఒక్క జిరాక్స్ కాపీకి రూ.2 ల చార్జీకి గాను రూ. 5 దుకాణదారుడికిచ్చాడు. మిగిలిన రూ.3 లను తిరిగి ఇవ్వాలని కురార్ దాస్ కోరాడు. దానికి దుకాణ యజమాని నిరాకరించాడు. పైగా బిక్షగాడు అంటూ దుర్భాషలాడాడు. తన డబ్బు తనకు ఇవ్వకపోగా.. పైగా తిట్టడంతో ప్రఫుల్ల కురార్ దాస్‌ వినియోగదారుల కోర్టుకు వెళ్లాడు. తన ఆర్థిక నష్టంతో పాటు మానోవేదనకు గురైనట్లు పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన వినియోదారుల కోర్టు బాధితుడికి 30 రోజుల్లోగా సంవత్సరానికి 9 శాతం వడ్డీతో రూ.25 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మెట్రోకు కూడా వినియోదారుల ఫోరం ఫైన్ విధించింది. మెట్రో రైల్వే స్టేషన్‌లో రూ.10 అదనంగా వసూలు చేశారనే ఫిర్యాదుతో మెట్రో సంస్థకు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్​ రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెలసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన లాయర్ వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ 2019 జనవరి 18న ఎల్​బీనగర్ మెట్రో రైల్వే స్టేషన్‌ను నుంచి ప్రయాణం చేశాడు.

మెట్రో రైలు ఎక్కే తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేకపోవడంతో ఆయన పడమర వైపు ఉన్న వేరే దారిలో వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయన మెట్రో రైల్వే సంస్థ జారీ చేసిన ట్రావెల్ కార్డను స్వైప్ చేయాల్సి వచ్చింది. రూ.10 ట్రావెల్ కార్డ్ నుంచి కట్ కాగా.. దీనిపై ఆయన వినియోగదారుల కమిషన్​ కు వెళ్లారు. రెండు వైపులు టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. దీంతో రూ.5 వేల తో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం కలిపి మొత్తం కలిపి రూ.10 వేలు చెల్లించాలని వినియోదారుల కమిషన్ స్పష్టం చేసింది.

YES9 TV