సినిమా రంగంలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినా రాని స్టార్ డమ్ ఒక్క మూవీతో వస్తుంది.
ఇప్పుడు బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇన్నేళ్లు యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో కాలం వెళ్లదీసిన
వైష్ణవి
కు బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ పడింది.
మొదటి సినిమాతోనే కుర్రాళ్లను ఊపేసింది. దాంతో తిరుగులేని ఫాలోయింగ్ వచ్చేసింది. ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆమె తర్వాత సినిమా ఎవరితో చేస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే తన నెక్ట్స్ మూవీ
అల్లు అరవింద్
తో ఉండబోతుందని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమాను ఓకే చేసిందంట.
అది కూడా అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ సినిమాలో. బేబీ మూవీతో ఆమెకు భారీ క్రేజ్ వచ్చేసింది. కాబట్టి ఆ క్రేజ్ ను వాడుకునేందుకు అల్లు అరవింద్ ఇలా ఉపయోగించు కుంటున్నాడంట. ఇంత పెద్ద హిట్ వచ్చినా సరే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావట్లేదు.
దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. తమ హీరోయిన్ కు అంత చిన్న సినిమాలో ఛాన్స్ ఇవ్వడం ఏంటి.. ఆమెకు దాంతో ఒరిగేదేం లేదు. నీ కొడుకు సినిమాకు ప్లస్ అవుతుందని వాడుకుంటున్నావా అంటూ అరవింద్ మీద మండిపడుతున్నారు వైష్ణవి అభిమానులు.
