Latest Posts

చైనాలో సీక్రెట్ మిషన్.. దేశభక్తిని రగిలించే భారతీయన్స్ ఎలా ఉందంటే?

టీనటులు: నిరోజ్ పుచ్చ, సమైరా సంధూ, శుభా రంజన్, పెడెన్ ఓ నామ్‌గ్యాల్, సోనమ్ బర్బుంగా, రాజేశ్వరి చక్రవర్తి తదితరులు

దర్శకత్వం: దీన్ రాజ్

నిర్మాత: డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి

మ్యూజిక్ డైరెక్టర్: సత్య కశ్యప్, కపిల్ కుమార్

సినిమాటోగ్రాఫర్: జయపాల్ రెడ్డి

ఎడిటర్: శివ సర్వాని

ఫైట్స్: జుడో రాము

బ్యానర్: టాలీ ఫిల్మ్స్

రిలీజ్ డేట్: 2023-07-15

చైనాలో భారత్ నిర్వహించే సీక్రెట్ మిషన్‌లో పాల్గొనేందుకు తెలుగు (నిరోజ్ పుచ్చ), నేపాలి (సోనమ్ బర్బుంగప హెయిలింగ్), పంజాబీ (సమైరా సంధూ), భోజ్‌పురి (సుభ రంజన్), త్రిపుర (పెడెన్ ఓ నమగ్యాల్), బెంగాళీ (రాజేశ్వరి చక్రబర్తి) ట్రైనింగ్‌కు పంపుతారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ ఆరుగురు ట్రైనింగ్ తీసుకొంటారు.

చైనాలోని మిషన్ కోసం శిక్షణ తీసుకొన్న తర్వాత ఏం జరిగింది? చైనాలోని ల్యాబ్‌లో ఏం జరిగింది. చైనాలోని ల్యాబ్‌లో జరుగుతున్న కుట్రను అడ్డుకొన్నారా? వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు ఒక్క చోట ఎందుకు కలిశారు? ఆరుగురికి ఎవరు శిక్షణ ఇచ్చారు? భారత్‌పై చైనా చేసిన కుట్ర ఏమిటి? ఈ ఆరుగురు దేశం కోసం ఏం సాధించారు? అనే ప్రశ్నలకు సమాధానమే భారతీయన్స్ సినిమా కథ.

 

దేశభక్తితో కూడిన భారతీయాన్స్ చిత్రం ఫస్టాఫ్‌ అంతా పాత్రల పరిచయంతోనే కొంత కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే బలమైన సన్నివేశాలు మరిన్నీ ఉంటే ప్రేక్షకుడు మరింత థ్రిల్ అయ్యే అవకాశం ఉండేది. సెకండాఫ్‌లో అసలు కథను దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషనల్‌గా కథను నడిపించిన తీరు బాగుంది. దేశభక్తిని రగిలించే ప్రయత్నం సినిమా ద్వారా చేసిన దర్శక, నిర్మాతలు అభినందనీయులు అనిపిస్తుంది.

భారతీయాన్స్ చిత్రంలో పాత్రల పేర్లను భాషలను బట్టి ఉండటం ఆయా భాషల వారికి కనెక్ట్ చేసేలా ఉంటాయి. సినిమా రంగానికి కొత్తవారైన ఆరుగురు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి. తెలుగు, బెంగాలీ, భోజ్ పురి, పంజాబీ, నేపాలి, త్రిపుర అంటూ రాసుకొన్న పాత్రల్లో నటీనటులు ఆకట్టుకొన్నారు. యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాల్లో తమ పాత్ర పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు.

భారతీయాన్స్ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ సినిమాకు బలంగా మారాయి. సిక్కి, నార్త్ ఇస్టర్న్ స్టేట్స్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఈ సినిమా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి.

ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో దేశభక్తిని రగిలించే సినిమాను నిర్మించాలనే ఆలోచనతోనే నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇలాంటి సినిమా తీయాలనే నిర్ణయమే పెద్ద సాహోసోపేతం. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా చూపించారు. అ%

YES9 TV