Latest Posts

తిరుపతి టు ఊటీ…. తగ్గిన ప్యాకేజీ ధర – 6 రోజుల టూర్ వివరాలివే

: ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

‘ULTIMATE OOTY EX TIRUPATI ‘ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా. ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జులై 18, 2023 తేదీన అందుబాటులో ఉంది.

షెడ్యూల్ :

-మొదటి రోజు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత ప్రయాణం ఉంటుంది.

-రెండో రోజు మార్నింగ్ 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత… మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

-మాడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు.

-నాల్గో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే స్టే చేస్తారు.

– ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది.

-ఆరో రోజు రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

Posted Under AP
YES9 TV