Latest Posts

‘కోర్టుకు రండి’.. ఆదిపురుష్​ టీమ్​కు అలహాబాద్​ హెచ్​సీ ఆదేశం!

దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్​ను వివాదాలు వెంటాడుతున్నాయి.

మరీ ముఖ్యంగా.. ఈ సినిమాను అలహాబాద్​ హైకోర్టు తీవ్రంగా పరగిణిస్తున్నట్టు కనిపిస్తోంది. చిత్రంపై ఇప్పటికే తన అసంతృప్తిని బయటపెట్టిన కొర్టు.. తాజాగా ఆదిపురుష్​ టీమ్​ ఆదిపురుష్​ టీమ్​కు పిలుపునిచ్చింది. జులై 27న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీనితోపాటు.. సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలంటూ.. ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

ఐదుగురు సభ్యుల కమిటీ..

ప్రభాస్​ నటించిన ఆదిపురుష్​ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్​ రాజేశ్​ సింగ్​ చౌహాన్​, జస్టిస్​ శ్రీ ప్రకాశ్​ సింగ్​లతో కూడిని వెకేషన్​ బెంచ్​. ఈ క్రమంలోనే జులై 27న హాజరుకావాలని సినిమా దర్శకుడు ఓం రౌత్​, నిర్మాత భూషణ్​ కుమార్​, డైలాగ్​ రైటర్​ మనోజ్​ ముంతషీర్​ను ఆదేశించింది. ఈ సినిమా.. ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి, స్పందన తెలపాలని కేంద్రానికి వెల్లడించింది అలహాబాద్​ హైకోర్టు ధర్మాసనం. అంతేకాకుండా.. ఆదిపురుష్​ సినిమాకు ఇచ్చిన సర్టిఫికేట్​ను రివ్యూ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

అసలు ఆదిపురుష్​ సినిమా.. ప్రజలకు చూపించే విధంగా ఉందా? లేదా? అన్న విషయంపై కేంద్ర సమాచారశాఖ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణలోపు.. స్పందన రాకపోతే.. మినిస్ట్రీ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ అండ్​ బ్రాడ్​కాస్టింగ్​లో నుంచి డిప్యూటీ సెక్రటరీ, అంత కన్నా పై స్థాయిలో ఉన్న అధికారులు.. వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదీ చూడండి:- Adipurush OTT Release: ఓటీటీలోకి ఆదిపురుష్ సినిమా ముందుగా ఆ విధానంలో రానుందా!

మరోవైపు.. తదుపరి విచారణలోపు.. తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ అఫిడవిట్​లు దాఖలు చేయాలని ఆదిపురుష్​ దర్శకుడు, డైలాగ్​ రైటర్​ను ఆదేశించింది అలహాబాద్​ హైకోర్టు వెకేషన్​ బెంచ్​. సినీ బృందం స్పందించేందుకు సమయాన్ని ఇస్తున్నట్టు అందుకే తాము ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఖురాన్​ను తప్పుగా చూపించగలరా..?

అంతకుముందు.. జూన్​ 28న ఆదిపురుష్​ వివాదంపై విచారణ చేపట్టిన అలహాబాద్​ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే చేసింది. “ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ ను తప్పుగా చూపుతూ డాక్యమెంటరీ తీయగలరా? అలా తీస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి” అని కోర్టు వ్యాఖ్యానించింది.

YES9 TV