కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులు నిత్యం హ్యాపీగా బయట తిరుగుతున్నారు.
దంపతులు హ్యాపీగా ఉన్నారని భార్య కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి సమయంలో భార్య కనపడకుండా పోవడం కలకలకం రేపింది. ఈ కేసులో ఊహించని ట్విస్టులు బయటకు వచ్చాయి.
పశ్చిమ బెంగాల్ లోని సోనాపుర్ లో భోంబల్ మండల్ అలియాస్ భోంబల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు తుంపా అనే యువతిని భోంబల్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నభోంబల్ మండల్ తరువాత అతని భార్య తుంపా బోంబల్ అనే పేరే మార్చాడు.
భార్య తుంపాతో హ్యాపీగా కాపురం చేస్తున్న భోంబల్ అతని పని అతను చేసుకుని వెళ్లాడు. తరువాత భోంబల్, తుంపా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను భోంబల్, తుంపా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. కుటుంబ సభ్యులు,ఊరి పెద్దలు చాలా సార్లు పంచాయితీలు చేసి భోంబల్, తుంపా దంపతులను ఒక్కటి చెయ్యాలని అనుకున్నారు.
అయితే పరిస్థితులు అనూకూలించలేదు. 2020లో తుంపా కనపడుకుండా పోయింది. తన భార్య తుంపా కనపడటం లేదని భోంబల్ కేసు పెట్టాడు. అప్పటి నుంచి తుంపా కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరికి తుంపా కనపడటం లేదనే కేసు అనేక మలుపులు తిరిగింది. తుంపా కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్ హైకోర్టును ఆశ్రయించడంతో కేసు సీఐడీకి బదిలి అయ్యింది. తుంపాను ఆమె భర్త భోంబల్ హత్య చేశాడనే మ్యాటర్ లీక్ కావడంతో కేసు మలుపు తిరిగింది.
