బెంగళూరు/న్యూఢిల్లీ: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కకపోవడంతో హైకమాండ్ మీద తిరుగుబాటు చేసిన పలువురు బీజేపీ నేతలు విధాన పరిషత్ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేశారు.
ఇప్పుడు కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు విధాన పరిషత్ సభ్యుల స్థానాలకు జూన్ 30న ఎన్నిక జరగనుంది. ఇప్పటికే శాసనమండలి సభ్యుల స్థానాలకు కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొనగా, అసెంబ్లీ ఎన్నికల అనంతరం మూడు స్థానాలు అధికార పార్టీ కాంగ్రెస్‌కు దక్కనున్నాయి.
విధానపరిషత్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మహిళా నేతలు లాబీయింగ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో జరిగిన చర్చ అనంతరం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగదీశ్ శెట్టర్, మంత్రి బోస్ రాజ్, తిప్పన్నప్ప కమకనూర్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని నాయకులు డిసైడ్ అయ్యారు. ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నారు.
