మొహరం వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని దొరిగల్లు, నాగల గుబ్బల ప్రజలకు అవగాహన

 

ముదిగుబ్బ yes9 TV
– ప్రజల కు ఇబ్బంది కలగకుండా చూడాలి
ముదిగుబ్బ సీఐ శివరాముడు
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ఆదేశాల మేరకుమొహరం వేడుకలను జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ముదిగుబ్బ సీఐ శివరాముడు సూచించారు. గురువారం దొరిగల్లు, నాగలగుబ్బల గ్రామాల్లో పర్యటించి గ్రామ పెద్దలు, నిర్వాహకులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మొహరం వేడుకలు సామరస్య వాతావరణంలో జరగాలని, అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారంతో కార్యక్రమాలు నిర్వహించుకోవాలనికోరారు. వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మొహరం వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ అన్ని విధాలా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
ఎలాంటి గొడవలు, వివాదాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే సంఘటనలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శివరాముడు హెచ్చరించారు. గ్రామ పెద్దలు, యువకులు పోలీసులకు సహకరించాలని సీఐ పిలుపునిచ్చారు.

Posted Under AP
Editor