కర్నూలు జిల్లా ఆలూరులోSIR పై అవగాహన కల్పిస్తున్న బీఎల్వోలు – ఇంటింటి కార్యక్రమం నిర్వహణ…
ఆలూరు న్యూస్…
ఆలూరు మండల కేంద్రంలోని నాలుగో వార్డు ఇంద్రనగర్‌లో బుధవారం బీఎల్వోలు, తలారుల ఆధ్వర్యంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించిన అధికారులు ప్రజలకు SIR కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు…
కర్నూలు జిల్లా ఆలూరులోSIR పై అవగాహన కల్పిస్తున్న బీఎల్వోలు – ఇంటింటి కార్యక్రమం నిర్వహణ…
