ఈ రైళ్లు బరిలోకి దిగితే ఎదురే ఉండదు

రైళ్లు.. అవి అందించే సేవలను బట్టి వాటికి ఇండియన్ రైల్వే ప్రయారిటీ కేటగిరిలో ఉంచుతుంది. ఇవి పట్టాలపై పరుగులు తీసే సమయంలో ఇతర రైళ్లను ఆపేసి మరీ వీటికి లైన్ క్లియర్ చేస్తారు.

దేశవ్యాప్తంగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు దాదాపు 10వేల రైళ్లు నడుస్తున్నాయి. పరిస్థితులనుబట్టి, సందర్భాన్ని బట్టి ఇవి తిరిగే సమయంలో ఇతర రైళ్లను నిలిపివేయడంలాంటివి చేస్తుంటారు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఇవి నడుస్తున్నాయి కాబట్టి సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లను పక్కనపెట్టి వీటికి లైన్ కేటాయిస్తారు. ఇండియన్ రైల్వే ప్రాధాన్యతా క్రమంలో ఏయే రైళ్లున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ARME ట్రైన్స్:ARME అంటే.. యాక్సిడెంటల్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ ట్రైన్. అత్యవసర సమయంలో లేదంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులకు వెంటనే వైద్యసేవలందించేందుకు వెళుతుంది. ప్రమాదంలో గాయపడినవారిని ఆసుపత్రికి పంపించడానికి, అక్కడ సహాయానికి అవసరమైన పరికరాలను అందజేస్తుంది.

VVIP రైళ్లు:ఈ రైళ్లు భారత రాష్ట్రపతిని లేదా కొన్ని ప్రత్యేక VVIPలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళతాయి. రాజధాని రైళ్లకన్నా ఇవే ముఖ్యమైన రైళ్లు. వీటికి లైన్ క్లియర్ చేయడంకోసం ఆ మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లన్నింటినీ రైల్వే నిలిపేస్తుంది.

సబర్బన్ రైళ్లు:ఇతర రైళ్లతో పోలిస్తే వీటికి అతి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నిర్ధిష్ట ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించే పౌరుల కోసం వీటిని నడుపుతుంటారు. రద్దీ సమయాల్లో ఇతర రైళ్లన్నీ సబర్బన్ రైళ్లకు లైన్ ఇవ్వాల్సి ఉంటుంది.

సూపర్ ఫాస్ట్ రైళ్లు:రైళ్లను వాటి వేగం, నిలిచే స్టేషన్లు ప్రకారం ప్రాధాన్యతా క్రమం రైల్వే ఇస్తుంది. రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. రాజధాని తర్వాత శతాబ్ది, దురంతో, తేజస్, గరీబ్ రథ్, డబుల్ డెక్కర్, జనశతాబ్ది రైళ్లకు ప్రాధాన్యతనిస్తారు.

YES9 TV