షయం ఏదైనా గులాబీ కమలం పార్టీ నేతల మద్య రచ్చ జరగల్సిందే. అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా తరవాత సంగతి ఒకరిపై ఒకరు మాత్రం ఆరోపణలు గుప్పించుకోవాల్సిందే.

వేములవాడ/హైదరాబాద్ : విషయం ఏదైనా గులాబీ కమలం పార్టీ నేతల మద్య రచ్చ జరగల్సిందే. అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా తరవాత సంగతి ఒకరిపై ఒకరు మాత్రం ఆరోపణలు గుప్పించుకోవాల్సిందే.

ప్రస్తుతం కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ కోణంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తుడని చెప్పుకొచ్చారు.చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదని, చెప్పులు విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారని వివరించారు.

ఈ నేపథ్యంలో అక్కడ ఆరోజు జరిగిన పరాణామాలను వివరించారు బండి సంజయ్. తాను కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ తోనే ఉన్నానని స్పష్టం చేశారు. సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు బీఎస్కే. వేములవాడ రాజన్న ఆలయ అయ్యగారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించడానికి ని టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్న ప్రస్తావించగా పైవిధంగా బదులిచ్చారు. ప్రకాశ్ జవదేకర్ వయసు 73 ఏండ్ల పెద్దాయన. నడుస్తుంటే జారి కింద పడబోతే పట్టుకున్నా… దానిని కూడా ఫాల్తుగాళ్లు రాద్దాంతం చేస్తారా? అంటూ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

YES9 TV