మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది.
ఎలాగైనా ఈసారి బీఆర్ఎస్ ను గద్దె దించాలని బిజెపి, కాంగ్రెస్ లు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలి అన్న దానిపైన కూడా ముమ్మర కసరత్తు సాగుతుంది.
రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. కేసీఆర్ మనసులో ఏముంది అన్న దానిపైన కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కవిత ఈ సారి ఎన్నికలలో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారని మొదట్లో టాక్ వచ్చింది. ఇప్పటికే నిజామాబాద్ లో పర్యటనలు చేస్తున్న కవిత నిజామాబాద్ పై గ్రిప్ కోసం ప్రయత్నిస్తున్నారు. బాగా గట్టిగానే ఫోకస్ పెట్టారు.
ఈ నేపధ్యంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కవిత పోటీ చేస్తారని టాక్ వినిపిస్తుంది.తాజాగా మరో నియోజకవర్గం పేరు కూడా తెర మీదికి వచ్చింది. ఎన్నికలలో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ముషీరాబాద్ నియోజకవర్గం లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమాలు, జీఎచ్ఎంసీ ఎన్నికల్లో గాంధీనగర్ ఇన్చార్జి గా పనిచేసిన అనుభవం కవితకు ఇక్కడ పనికొస్తుందని భావిస్తున్నారని సమాచారం.
అంతేకాకుండా అత్యధికంగా సంక్షేమ పథకాలు పొందిన మైనార్టీలు ఈ సెగ్మెంట్లోనే ఉండటంతో కవితత విజయం సాధించడం సులువు అని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికీ ఈమేరకు సర్వే చేయించిన కవిత కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం త్యాగానికి రెడీగా ఉన్నారని సమాచారం. ముషీరాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో ముఠా గోపాల్ కు టికెట్ ఇప్పించారు ఎమ్మెల్సీ కవిత.
ఎమ్మెల్యేగా ఉన్న ముఠా గోపాల్ కవిత కోసం ఈ సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ముఠా గోపాల్ ఆరోగ్యం కూడా సహకరించకపోవటంతో ఆయన కవిత కోసం ఈ స్థానాన్ని వదిలేసే అవకాశం ఉంది.ఈ క్రమంలో కవిత ఈ సారి ఎన్నికలలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడానికి కవిత ఎక్కడ పాగా వేయబోతున్నారు అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
