ఉచితంగా డేటా ఇస్తున్న టెలికం కంపెనీ

ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా ఉన్న వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు ఉచితంగా 6 జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. హంగామా గోల్డ్ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.

వొడాఫోన్ గతంలోనే మ్యూజిక్ ప్లాట్ ఫాం హంగామాతో ఒప్పందం కుదుర్చుకుంది. వీఐ యాప్ ద్వారా మ్యూజిక్ సేవలు అందిస్తోంది.

ఈ యాప్ లో వీఐ మూవీస్ అండ్ టీవీ ప్లాట్‌ఫామ్‌కు ఈ సేవలు అదనం. హంగామా గోల్డ్ వినియోగదారులకు ఉచితంగా 6 జీబీ డేటా వస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 108. మూడు నెలల వరకు తీసుకోవచ్చు. ఉచితంగా లభించే 6 జీబీ డేటా మూడు నెలల వరకు వాలిడిటీలో ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకోవడంద్వారా ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చిన పాటను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.

సంగీతం అంటే చెవి కోసుకునేవారి కోసం ఉచిత గోల్డ్ ట్రయల్ ద్వారా కూడా హంగామా సేవలు పొందొచ్చు. అయితే ఈ ట్రయల్ పూర్తయిన తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వీఐ యాప్ ద్వారా సర్వీసులను అందిస్తూ రెవెన్యూ పెంచుకోవాలని వొడాఫోన్ ఐడియా భావిస్తోంది. వీఐ యాప్‌ను సూపర్ యాప్‌గా మార్చాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఒకే యాప్ ద్వారా వివిధ రకాల సేవలను అందుబాటులోకి తేవాలని కంపెనీ చూస్తోంది.

అంతేకాకుండా తన ఏఆర్ పీయూ కూడా పెంచుకోవాలనుకుంటోంది. దీనికోసం రెండు ప్లాన్స్ వాలిడిటీని తగ్గించింది. రూ.99, రూ.128 ప్లాన్స్ ఇవి. ఒకదాని వాలిడిటీని 15 రోజులకు, మరో ప్లాన్ వాలిడిటీని 18 రోజులకు తగ్గించింది. దీంతో వొడాఫోన్ వినియోగదారులు తరుచుగా వీటితో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీ ఏఆర్ పీయూ పెరుగుతందని భావిస్తున్నారు. ఎయిర్ టెల్ కూడా రీచార్జ్ ప్లాన్స్ ధరలను ఇప్పటికే పెంచిన విషయం తెలిసిందే. రానున్న కాలంలో మళ్లీ ధరల పెంపు ఉంటుందని భావిస్తున్నారు.

YES9 TV