బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో సీఎం సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో హోమ్ శాఖలో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ సీహెచ్. ప్రతాప్ రెడ్డి మీద బదిలి వేటు వేసిన సిద్దరామయ్య ప్రభుత్వం అనేక మంది ఐపీఎస్ అధికారులకు బదిలి చేసింది.
బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా ప్రతాప్ రెడ్డి 2022 మే 17వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రతాప్ రెడ్డి ఇంకా కొంతకాలం పాటు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతాప్ రెడ్డి బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
తిరుమలలో విశేష ఉత్సవాలు, ఆరోజుల్లో కొండ మీద శ్రీవారి భక్తులకు పండగ !
కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్ గా బదిలి కావడం, అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఐపీఎస్ అధికారులకు స్థానచలనం మొదలైయ్యింది. బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డిని సెక్యూరిటీ విభాగం డీజీపీగా నియమించారు. బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి బి. దయానంద్ ను నియమిస్తూ మంగళవారం సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరు ట్రాఫిక్ విభాగం అడిషనల్ పోలీసు కమీషనర్ గా పని చేస్తున్న ఎంఏ. సలీమ్ ను సీఐడీ డీజీగా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో సీనియర్ పోలీసు అధికారి శరత్ చంద్రాను కర్ణాటక ఇంటలిజెన్స్ విభాగం డీజీపీగా నియమిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నామాటే శాసనం, అన్ని చేసి నిరుపిస్తా అని పబ్లిక్ గా చాలెంజ్ చేసిన గాలి జనార్దన్ రెడ్డి !
