అనాథ పిల్లలతో జగన్ దంపతులు: ఆప్యాయంగా పలకరింపు

మరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాళ్టితో నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి.

2019లో ఇదే రోజున వైఎస్ జగన్.. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల కాలాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకొంటోన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తోన్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. బైక్ ర్యాలీలను ఏర్పాటు చేశారు.

Posted Under AP
YES9 TV