బీజేవైఎం నేతల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. విశాఖలోని సీతకొండ వ్యూ పాయింట్ పేరును మార్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులకు కాదు.. లోటస్ పాండ్ కు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండని పేర్కొన్నారు. సీఎం స్పందించి పేరు మార్పును ఉపసంహరించుకోవాలని వెల్లడించారు. అరెస్ట్ చేసిన నేతలను విడుదల చేయాలని సూచించారు.
