నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ అంతా ఎంతో ఆస్కక్తిగా ఉండగా అప్పుడు ఇప్పుడు అంటూ వారిని నిరాశపరుస్తున్నారు. లెజెండ్, శాతకర్ణి సినిమాల టైం లోనే వారసుడి కెమియో ఉంటుందని హడావుడి చేశారు కానీ అదేమి జరగలేదు.
అయితే ఈసారి మాత్రం పక్కాగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. బోయపాటి శ్రీను బాలకృష్ణ త్వరలో అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ సినీమలో మోక్షజ్ఞ కూడా ఉంటాడని చెబుతున్నారు. జూన్ 12న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఎనౌన్స్ చేస్తారట. అఖండతో బాలకృష్ణ మరోసారి తన సత్తా చాటగా అఖండ 2 సరికొత్త కథతో మరో రేంజ్ చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో మోక్షజ్ఞ ఉండటం కూడా ఫ్యాన్స్ కి ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగ చేస్తుంది. అయితే సోలో హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం కొన్నాళ్లు టైం ఉందని చెబుతున్నారు. మరి అఖండ 2 లో మోక్షజ్ఞ ఉండటం కన్ఫర్మా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపుడి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దసరాకి రిలీజ్ అవుతుంది. ఎన్.బి.కె 108లో కాజల్ హీరోయిన్ కాగా శ్రీలీల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.
