బాహుబలి విడుదల తర్వాత గుణశేఖర్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో హిరణ్యకశ్యప అనే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు. సురేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ అండదండలతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అన్నారు.
అప్పట్లోనే ఈ చిత్రానికి 300 కోట్ల బడ్జెట్ చేసాడు గుణశేఖర్. ఐతే ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ ఊసు ఎత్తలేదు గుణశేఖర్. తర్వాత శాకుంతలం చిత్రాన్ని భుజాలకెత్తుకోవడం, తర్వాత దిల్ రాజు చేయి కలపడం జరిగిపోయాయి.
ఇప్పుడు శాకుంతలం విడుదలైంది. దాని రిజల్ట్ కూడా మనందరం చూసాం. ఈ నేపథ్యంలో గుణశేఖర్ ను నమ్మి హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ కోసం 300-400 కోట్లు ఖర్చుపెట్టే నిర్మాత ఎవరూ లేరనే అనుకోవచ్చు. రుద్రమదేవి, శాకుంతలం దెబ్బలకి గుణశేఖర్ కూడా సొంత నిర్మాణ సంస్థలో ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి హిరణ్యకశ్యప లేదనే అనుకోవాలేమో.
