Latest Posts

ఐపీఎల్ లో అడుగుపెట్టనున్న రామ్ చరణ్?

క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్( IPL) కి ఉన్న క్రేజే వేరు. ప్రతి ఏటా వేసవి ఆరంభంలో క్రికెట్ అభిమానులను ఈ లీగ్ అలరిస్తూ ఉంటుంది.

సాధారణ అభిమానులే కాకుండా ఐపిఎల్ అంటే సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan), స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా( Priti Zinta) ఒక్కో ఫ్రాంచైజ్ లో భాగమై ఉన్నారు.

తాజాగా ఈ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan Tej)కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. చరణ్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఆ మక్కువతోనే వచ్చే ఏడాది ఆంధ్ర ప్రదేశ్ లో వైజాగ్ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండగా ఆంధ్ర నుంచి రిప్రెసెంట్ చేస్తూ ఒక టీం కూడా లేదు. దీంతో ఏపీ నుంచి కూడా ఒక టీమ్ ని ఐపీఎల్ లోకి దింపాలని రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

అన్ని కుదిరితే వచ్చే ఏడాది వైజాగ్ ఫ్రాంచైజ్ ని చెర్రీ కొనుగోలు చేస్తారట. ఈ టీంకు ‘వైజాగ్ వారియర్స్’ అనే పేరు కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే నటుడిగా, వ్యాపారవేత్తగా చెర్రీ దూసుకుపోతున్నారు.

సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ చేంజర్’ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ( Kiara Adwani) ఇందులో కథానాయిక. దీని తర్వాత చెర్రీ..బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

YES9 TV