గత కొంతకాలంగా టీమిండియా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu) రాజకీయాల్లోకి వస్తారని ఊహగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడా వార్తలకు బలం చేకూరేలా రాయుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy) శ్రీకాకుళం పర్యటనలో భాగంగా మాట్లాడిన వీడియోను రాయుడు రీట్వీట్ చేశాడు.
‘ఈ యుద్ధంలో నా ధైర్యం, ఆత్మవిశ్వాసం, బలం మీరే అంటూ ప్రజల్ని ఉద్దేశిస్తూ సిఎం మాట్లాడుతున్న వీడియోను రాయుడు షేర్ చేశాడు. ‘గ్రేట్ స్పీచ్ జగన్ సార్. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీపై విశ్వాసం ఉంది. మిమ్మల్ని నమ్ముతున్నారు’ అంటూ రీట్వీట్ లో రాసుకొచ్చాడు.
‘అభివృద్ధిలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది’ అంటూ కొద్దిరోజుల క్రితం రాయుడు వ్యాఖ్యానించాడు. దీంతో అతడి పొలిటికల్ ఎంట్రీ పై చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ ట్వీట్ తో రాయుడు రాజకీయ ప్రవేశం లాంఛనంగానే కనిపిస్తోంది. రాయుడు వైఎస్ఆర్సిపి లో చేరి వచ్చే ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీ చేస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం రాయుడు క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
