Latest Posts

: వైఎస్ జగన్ అనుభవ లేమి.! ఇంకో ఐదేళ్ళు కావాలి.!

సరిపోయింది సంబరం.! నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినాగానీ, ఇంకా అనుభవం రాలేదట. అనుభవం రావాలంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంకోసారి అవకాశం ఇవ్వాలట.

ఇంకో ఐదేళ్ళు గనుక ఆ అవకాశం దక్కితే, అప్పుడు అనుభవం పూర్తిగా వస్తుందట.

ఈ విషయంలో రాష్ట్రంలో వైసీపీ క్యాడర్‌కీ, వైసీపీ నేతలందరికీ తెలుసట. కార్యకర్తల్లోనూ, ముఖ్య నేతల్లోనూ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి వుందట. ఆ విషయం కూడా పార్టీలో అందరికీ తెలుసునట. అలాగని, స్వయానా వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

ఇదండీ వరస.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన జరుగుతోందో.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శల సంగతి సరే సరి. ‘నేను అధికారంలోకి వస్తే..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2019 ఎన్నికల ప్రచారంలో నినదించారు. అధికారంలోకి వచ్చారు. ప్రజలు నమ్మి, అఖండ మెజార్టీ కట్టబెట్టారు మరి.! మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారు.?

రాష్ట్ర రాజధానిని అయోమయంలో పడేశారనీ, పోలవరం ప్రాజెక్టుని పాతరేశారనీ, ప్రత్యేక హోదాని గాలికొదిలేశారనీ.. విపక్షాలు నిత్యం విమర్శిస్తుండడం మామూలే. విపక్షాల విమర్శల సంగతి తర్వాత, సొంత పార్టీలోనే ముఖ్యమంత్రికి సెగ తగులుతోంది. ‘మా ముఖ్యమంత్రికి అనుభవం లేదు’ అని వైసీపీ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారాయె.!

మొన్నటికి మొన్న నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని తూలనాడారు. వారిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారనుకోండి. అది వేరే సంగతి. ఎంపీ రఘురామకృష్ణరాజు మీద మాత్రం సస్పెన్షన్ వేటు వేయలేకపోతోంది వైసీపీ. మరి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంగతేంటి.? ఈయనపైనా ‘వేటు’ పడుతుందా.?

YES9 TV