ముదిగుబ్బ: సత్యసాయి వాటర్ సప్లయ్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు గత ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె వరుసగా మూడో రోజుకు చేరింది.
నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే మా కుటుంబాలు ఎలా బతకాలి.. ఆకులు తిని బతకాలా?” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు, యాజమాన్యం వెంటనే స్పందించి ఐదు నెలల బకాయి వేతనాలను చెల్లించి తమ సమస్యను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
కార్మికుల ఆందోళనకు నబీ రసూల్, ముత్యాలప్ప, చంద్ర, నారాయణస్వామి, సి. వీరభద్రయ్య, సీఐటీయూ ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్, కో-కన్వీనర్ టైలర్ ముస్తఫా తదితరులు మద్దతు తెలిపారు. కార్మికులకు వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
వరుసగా మూడో రోజుకు చేరిన సత్యసాయి వాటర్ సప్లయ్ కార్మికుల సమ్మె
