గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆలూరు పట్టణంలో జనసేన నాయకులు, వీర మహిళలు, యువత మరియు జనసైనికుల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం న్యూ బస్ స్టాండ్ నుంచి చెక్‌పోస్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన వీర మహిళలు, యువత మరియు జనసైనికులతో కలిసి సుమారు 2,000 మంది పాల్గొని భారీ ర్యాలీగా ఆలూరు పట్టణంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ర్యాలీ అనంతరం ఆలూరు గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ వెంకప్ప అన్న మరియు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి అక్క పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని కేవలం వేడుకలకు పరిమితం చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేశారు. అలాగే 150 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో జనసేన డైరెక్టర్లు సునంద, సరోజమ్మ, ఉదయ్ పాల్గొన్నారు.
అదేవిధంగా ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు మున్నా, యశోద, మునీర్, శేఖర్, బాషా, అరవింద్, చంద్ర, నందు, శివ తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న వీర మహిళలు, యువత, జనసైనికులు మరియు అభిమానులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
