జనసేన వీరమహిళ లేఖ (నాగవేణి)మరియు లాయర్ ప్రవీణ్ కుమార్, ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. అనంతరం బళ్లారి రోడ్డులోని SLNS థియేటర్ వద్ద నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా లేఖ (నాగవేణి) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ— పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆలూరులో జనసేనను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం వీరమహిళలు మరింత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి జనసేనలో చేరాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెద్దహోతురు రాజు, రంగస్వామి, సునీల్, లింగా, భాషా, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
