ముదిగుబ్బ: ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి గ్రామ సచివాలయంలోని రైతు సేవా కేంద్రంలో రైతులకు పశుగ్రాస విత్తనాలను ప్రభుత్వ సబ్సిడీపై పంపిణీ చేశారు.
ఒక కిలో విత్తనాల ధర రూ.100 కాగా, ప్రభుత్వం రూ.75 సబ్సిడీ అందిస్తోంది. దీంతో రైతులు కిలోకు కేవలం రూ.25 చెల్లించాలి. 5 కిలోల బ్యాగును రూ.125కు పొందవచ్చని అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ చెన్న కృష్ణ తెలిపారు.
ఈ విత్తనాలతో లభించే పశుగ్రాసం వల్ల ఆవులు, గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల దిగుబడి పెరుగుతుందని ఆయన వివరించారు.
కార్యక్రమంలో మలకవేముల టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, కూటమి నాయకులు గుత్తా సురేంద్ర నాయుడు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు గుత్తా కార్తీక్ నాయుడు, బూత్ కన్వీనర్ చిలకల నబీ రసూల్, రంగనాయకులు, కోగిర రాము, మాదాసు గంగాద్రి, రమణయ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.
