ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ ఓటర్లు గుర్తింపు అనే అంశంపై మలక వేముల క్రాస్ లో ఉన్న సచివాలయంలో ముదిగుబ్బ మండల ఎంపీడీవో హాజీ వలి హాజీ సాహెబ్ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. మలక వేముల గ్రామపంచాయతీ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ మరియు బిసి ఓటర్లు తమ కులంలో తప్పులు దొర్లి ఉంటే గుర్తించి తమ కులం ఆధారంగా అధికారులు దృష్టికి తీసుకొచ్చి సరి చేసుకో వాలని ఎంపీడీవో గ్రామ సభ ద్వారా తెలిపారు . తమ కులంలోని ఓటర్ల శాతం ముఖ్యమని కావున ఈ వర్గాల ఓటర్లు దొర్లిన తప్పులను గ్రామ సచివాలయ సెక్రటరీ, సిబ్బంది ద్వారా సరిచూసుకోవాలని అలాగే ఓటర్ లిస్టును వెరిఫికేషన్ చేసుకోవాలని తెలిపారు. గ్రామసభ ప్రోగ్రాంలో ముదిగుబ్బ ఎంపీడీవో హాజీవ్ అలీ సాహెబ్, మలక వేముల, సానేవారిపల్లి పంచాయతీ సెక్రటరీలు బాబ్జాన్, నవితమ్మ, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, నాగరెడ్డి పల్లి రంగనాయకులు, తోలేటి ఆదినారాయణ రెడ్డి, మాదాసు గంగాద్రి, వి. సుదర్శన, మలక వేముల ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మంజుల, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు
ముదిగుబ్బ మండలం మలక వేముల గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ ఓటర్లు గుర్తింపు…
