ముదిగుబ్బ: ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాలపై ఉన్న ముదిగుబ్బకు చెందిన ఆరేవేటి నారాయణ చారిని పోలీసులు గుర్తించి రక్షించారు. PCs రామమోహన్, రంగారెడ్డి వెంటనే స్పందించి ఆయనను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.
రైలు పట్టాలపై ఉన్న వ్యక్తిని రక్షించిన పోలీసులు
