ప్రజా భద్రతపై అవగాహనకు రూ.లక్ష నిధులు
ముదిగుబ్బ MPDO శ్రీ హాజీ వలి, MPP శ్రీ ఆది నారాయణ సమక్షంలో MPDO నిధుల నుంచి రూ.1 లక్ష మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్య కూడళ్లు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు.
రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వినియోగం, POCSO చట్టం, గృహ హింస, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, మైనర్ ఎలోప్‌మెంట్స్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నిరంతర అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో భద్రతా చైతన్యం పెంచడం, నేరాలు మరియు ప్రమాదాలను నివారించడం లక్ష్యమని పట్నం ఎస్‌ఐ తెలిపారు.
ప్రజా భద్రతపై అవగాహనకు రూ.లక్ష నిధులు…
