Latest Posts

కోకాపేట నివాసంలో మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్: బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును హైదరాబాద్‌లోని కోకాపేట్ నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రిని సందర్శించేందుకు ఆయన పిలుపునివ్వడంతో, అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పర్యటన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే హరీశ్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

పోలీసులు చేపట్టిన ఈ ఆకస్మిక గృహ నిర్బంధంపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పలువురు నేతలు నిరసన వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Editor