మొలకవేముల క్రాస్‌లో వైద్య సిబ్బంది, ప్రజలతో కలిసి ర్యాలీ…
ముదిగుబ్బ మొలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొలకవేముల క్రాస్‌లో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి. నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ దోమలు అభివృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి నిర్మూలించాలని సూచించారు. ప్రతి శుక్రవారం ప్రజల సహకారంతో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తే దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ దోమతెరలు ఉపయోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
వర్షాకాలంలో దోమల పెరుగుదలను ముందుగానే అరికడితే మలేరియా వంటి వ్యాధులను నియంత్రించి మలేరియా రహిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలు వైద్య ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో PHN మంజుల, సూపర్వైజర్లు PN రవిశంకర్, M. అలివేలమ్మ, CHOలు, ANMలు, హెల్త్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా
