ముదిగుబ్బ yes9Tv
ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గండ్రగొడ్లి వెంకటనారాయణ ను ధర్మవరం నియోజకవర్గ మహర్షి వాల్మీకి బోయ సంఘం అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షులు నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని వాల్మీకి బోయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కనుమ ప్రభాకర్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. నియోజకవర్గ అధ్యక్షునిగా ఎంపికైన గంట గొడ్లి వెంకటనారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని బోయ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తానని, వారి అభివృద్ధి అభ్యున్నతి కోసం పాటుపడతానని అలాగే రాష్ట్ర నాయకత్వం తనపై విశ్వాసం ఉంచి నియోజకవర్గ పదవిని బాధ్యతలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
