అనంతపురం జిల్లా రాయదుర్గం
*చలో కర్నూల్ కు బయలుదేరిన 2025 డీఎస్సీ అభ్యర్థులు
*డీఎస్సీ అభ్యర్థులు బయలుదేరుతున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే
*
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ‘చలో కర్నూల్’ సందడి నెలకొంది! 2025 మెగా డీఎస్సీ ఎంపికపై వైకాపా చేస్తున్న అవినీతి ఆరోపణలు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నూతన ఉపాధ్యాయులు సమరశంఖం పూరించారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఎంపికైన 234 మంది ఉపాధ్యాయులు కర్నూలులో జరిగే భారీ సంఘీభావ ర్యాలీకి తరలివెళ్లారు. స్థానిక R&B అతిథి గృహం వద్ద సిద్ధం చేసిన మూడు ప్రైవేటు బస్సులకు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పచ్చజెండా ఊపి యాత్రను ఉత్సాహంగా ప్రారంభించారు. రాత్రింబవళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధించిన తమపై లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్న వైకాపా నాయకులకు బుద్ధి చెప్పేందుకే ఈ సంఘీభావ యాత్ర అని అభ్యర్థులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగవంతంగా, కేవలం 230 రోజుల గడువులో దాదాపు 180కి పైగా కేసులను ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ 2025ను మన ప్రభుత్వం నిర్వహించింది. కేవలం ప్రతిభ ఆధారంగానే ఇక్కడ అభ్యర్థుల నియామకం జరిగింది. కావాలనే వైకాపా నాయకులు ప్రతిభావంతులను అవమానించేలా, ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను కించపరిచేలా దుష్ప్రచారానికి దిగారు. చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు సాక్షిగా జరుగుతున్న ఈ ఐక్యతా కార్యక్రమాన్ని చూసైనా, ఈ దుష్ప్రచారం చేసేవాళ్ల నోళ్లు మూతపడాలి! ‘నిజం గడప దాటేలోపే అసత్యం ఊరంతా తిరిగొస్తుంది’ అనే సామెతలా ఉంది వీళ్ల తీరు. సత్యాన్ని బ్రతికించుకోవడానికి, ప్రతిభావంతులకు జరుగుతున్న అవమానాన్ని ఎదుర్కోవడానికి జరుగుతున్న ఈ పోరాటానికి సమాజంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని కోరుతున్నాను.
కేవలం ప్రతిభనే నమ్ముకుని, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉద్యోగాలు సాధించిన తమ కష్టాన్ని వైకాపా రాజకీయం చేస్తోందని నూతన ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండారెడ్డి బురుజు సాక్షిగా తమ ఐకమత్యాన్ని చాటి చెప్పి, అసత్య ప్రచారాల ముసుగు తొలగిస్తామని హెచ్చరిస్తూ కర్నూలు బాట పట్టారు.
కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పోరాటంగా మారిన ఈ ‘చలో కర్నూల్’ ర్యాలీతోనైనా ప్రతిపక్షాల అవాస్తవ ప్రచారాలకు తెరపడుతుందో లేదో వేచి చూడాలి.
