Latest Posts

శ్రీ సత్యసాయి జిల్లా: ముదిగుబ్బ మండలం గుంజేపల్లిలో ధర్మవరం డీఎస్పీ విస్తృత తనిఖీలు – గ్రామస్తులకు శాంతి భద్రతలపై ప్రత్యేక అవగాహన!

ఈరోజు ధర్మవరం డీఎస్పీ సార్ గారు, ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ విజిట్ చేసి, గుంజేపల్లి గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు
ముదిగుబ్బ yes9 TV
ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు క్రింది అంశాలపై అవగాహన కల్పించబడింది:
– మహిళలపై జరిగే నేరాల నివారణ, మహిళల భద్రత మరియు అటువంటి సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం.
– అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీసు సహాయం కోసం డయల్-100 సేవను వినియోగించుకోవాల్సిన విధానం.
– సంఘ విద్రోహులు మరియు అలవాటు నేరస్థులపై అమలు చేసే ఫోర్‌ఫీచర్ (Forfeiture) మరియు ఎక్స్‌టర్న్‌మెంట్ (Externment) చట్టపరమైన నిబంధనల గురించి వివరించడం.
– రాబోయే వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం, సామరస్యాన్ని కాపాడడం, శబ్ద కాలుష్య నిబంధనలను పాటించడం, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని సూచించడం.
ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ అర్బన్ ఇన్స్పెక్టర్, సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Posted Under AP
Editor