కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ నెల 25న సీఎం చంద్రబాబు పర్యటన: ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు!

కర్నూలు జిల్లా,
ఆస్పరి లో ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పరి పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ల్యాండింగ్‌కు అనువైన స్థలాన్ని ఆర్డీఓ ఓబులేసు పరిశీలించారు. అలాగే సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ స్థలాలు, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిచి కృష్ణమ్మ, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
25వ తేదీన జరిగే ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు.

Posted Under AP
Editor