మన పల్లెలను మనమే రక్షించుకుందాం..

ముదిగుబ్బ yes9TV
ఈరోజు ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జొన్నల కొత్తపల్లిలో హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ ఉపయోగించి 64 మందికి ఎక్స్రేలు తీయడం జరిగింది క్షయ వ్యాధిని తరిమి కొట్టడానికి ప్రభుత్వము ఎక్స్ రే మిషన్లను పల్లెలకే పంపి అక్కడ ప్రతివారికి ఎక్స్రేలు తీసి క్షయ వ్యాధి ఉన్నదా లేదా అని నిర్ధారించి నిర్ధారణ అయితే వారికి ఆరు నెలలు ఉచితంగా మందులు అందజేయబడతాయి ముఖ్యంగా మధుమేహము 60 సంవత్సరాలు పైబడిన వారు పాత క్షయరోగి ఇంటిలోని వారు ధూమపానం చేయువారు ఆల్కహాల్ సేవించువారు ఇలాంటివారిని కచ్చితంగా ఎక్స్ రే లను తీయించి వారికి పాజిటివ్ వస్తే మందులు ఇవ్వాలి. వీరికే కాకుండా రెండు వారాలకు మించి దగ్గు ఉన్నవారు సాయంత్రం పూట జ్వరం వచ్చి వారు ఆకలి లేని వారు బరువు తగ్గిపోతున్న వారు దగ్గినప్పుడు గళ్ళలో రక్తం పడేవారు అందరూ కూడా ఎక్స్రే తీయించుకోవాలి తీయించుకున్న తర్వాత పాజిటివ్ వస్తే ఆరు నెలలు ఉచితంగా మందులు ఇస్తూ వారికి నెలకు ₹1000 చొప్పున వారి బ్యాంకు ఖాతా నందు పౌష్టిక ఆహారం కొరకు జమ చేయబడతాయి ప్రతి పల్లెలో ఉన్నవారు నాకెందుకులే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోకుండా ఒకరికి ఒకరు క్షయ వ్యాధి గురించి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చినప్పుడు క్షయ వ్యాధిని మనము అరికట్టగలము కాబట్టి మన పల్లెల్లో మనమే కాపాడుకుందాం ఈ కార్యక్రమంలో కదిరి టీవీ యూనిట్ సూపర్వైజర్ శ్రీనివాసులు విశ్వనాధ్ జొన్నల కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిహెచ్ఓ జయతేజ నాయక్ ఆరోగ్య కార్యకర్త వాణి ఆశాలు సునీత అమీనా పాల్గొన్నారు…

Posted Under AP
Editor