అనంతపురం ప్రెస్ క్లబ్ ఎన్నికల వివాదం: కలెక్టర్ హామీతో జర్నలిస్టుల ఆమరణ నిరాహార దీక్ష తాత్కాలిక విరమణ!

కలెక్టర్ హామీ… జర్నలిస్టుల ఆమరణ దీక్ష విరమణ…. అనంతపురం న్యూస్ : అనంతపురం ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు జరపాలని నాలుగవ రోజు జర్నలిస్టులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణతో పాటు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్పందించారు. తక్షణం ఎన్నికలు జరిపేలా తగిన చర్యలు తీసుకోవాలని ఐ అండ్ పి ఆర్ ఏడి బాల కొండయ్యకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశానుసారం ఎన్నికలు నిర్వహిస్తామని దీక్షలో కూర్చున్న జర్నలిస్టులకు ఏడి హామీ ఇవ్వడంతో దీక్షను తాత్కాలికంగా విరమించుకున్నారు. ఈనెలాఖరులోగా హామీ నెరవేరని పక్షంలో మళ్లీ ఆమరణ నిరాహార దీక్షలకు పోతామని సీనియర్ జర్నలిస్ట్ చెరుకూరి రామాంజనేయులు, రవి, రామ్మూర్తి, త్యాగరాజు, క్రైమ్ రిపోర్టర్ రమేష్, కుమార్, భాస్కర్, హరికృష్ణ , కుల్లాయప్పలు స్పష్టం చేశారు. ఈ దీక్షలకు పలువురు సీనియర్ జర్నలిస్టులు కుల, ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు.

Posted Under AP
Editor